కామారెడ్డి జిల్లాలో అరుదైన వేడుక.. ట్విన్ బ్రదర్స్‌ను పెళ్లాడిన ట్విన్ సిస్టర్స్

కలం, నిజామాబాద్ బ్యూరో: ఇద్దరు కవల అక్కాచెల్లెళ్ళు (Twin Sisters).. ఇద్దరు కవల అన్నదమ్ములు (Twin Brother).. పెళ్లి చేసుకోవడం సినిమాల్లో చూస్తుంటాం. కానీ రియల్ లైఫ్‌లోనూ ఈ సీన్ రిపీట్ అయ్యింది. కామారెడ్డి (Kamareddy) జిల్లాలో ఈ అరుదైన పెళ్లి వేడుక ఆవిష్కృతమైంది. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ (ఎం) గ్రామానికి చెందిన దుంపటి భాస్కర్- సుజాత దంపతులకు కవల పిల్లలు విజయ్ కుమార్, వినయ్ కుమార్ ఉన్నారు. ఇక తాడ్వాయి మండలం దేమి కలాన్ గ్రామానికి చెందిన కుమ్మరి రాజమణి – సాయన్నల దంపతులకు కవల కుమార్తెలు కీర్తన, కీర్తి ఉన్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డిలోని బృందావన్ గార్డెన్‌లో వీరి పెళ్లిళ్లు ఘనంగా జరిగాయి.

మూడు నెలల కిందట నిశ్చితార్థం కాగా, ఇటీవల పెళ్లి (Marriage) చేసుకున్నారు. డబుల్ కపుల్ ఆప్ ట్విన్స్ చూసి చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కవలలకు కవలలే దొరకడం చాలా అరుదు అంటూ పలువురు చర్చించుకున్నారు. ట్విన్స్‌ను పెళ్లి చేసుకుంటామని తాము ఊహించలేదని, ఒకే ఇంటికి వెళ్తామని అనుకోలేదని కవల అమ్మాయిలు చెప్పారు. అలాగే కవల అక్కాచెల్లెళ్ళను తాము పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ట్విన్ బ్రదర్స్ ఆనందం వ్యక్తం చేశారు. కామారెడ్డి (Kamareddy) జిల్లాలో ఈ అరుదైన పెళ్లి వేడుక వైరల్ అయ్యింది.

Read Also: ఇన్ స్టాలో వీడియోలు.. యువకుడిపై సర్పంచ్ దాడి..

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>