epaper
Sunday, March 1, 2026
epaper

పట్టపగలు నడివీధిలో యువకుడిని కాల్చి చంపారు

కలం, వెబ్​ డెస్క్: పట్టపగలు నడివీధిలో యువకుడిని కాల్చి చంపారు. దేశ రాజధానికి సమీపంలోని గ్రేటర్​ నోయిడాలో(Greater Noida) జరిగిన ఈ సంఘటన కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 11గంటల సమయంలో నితిన్​(25) తన ఇంటి నుంచి పని మీద బయటకు వెళ్తున్నాడు. అప్పటికే పొంచి ఉన్న దుండగులు హఠాత్తుగా నితిన్​ తుపాకులతో నితిన్​ వెంటపడ్డారు. అది గమనించి నితిన్ పరిగెత్తేందుకు ప్రయత్నిస్తూ కిందపడిపోయాడు. వెంటనే ఆ యువకుడిని చుట్టిముట్టిన దుండగులు తుపాకీలతో పలుసార్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు వెంటనే నితిన్​ ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

విషయం తెలిసి ఎకోటెక్​పార్క్​–1 పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్లు ప్రాథమికంగా తేల్చారు. సచిన్​, అతని మిత్రులతో కొన్నేళ్లుగా నితిన్​కు గొడవలు జరుగుతున్నాయని, ఆ క్రమంలోనే ఈ హత్య జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో ఎలాంటి గొడవలు చెలరేగకుండా, ముందు జాగ్రత్తగా కర్ఫ్యూ విధించారు.

కాగా, నిందితులు.. నితిన్​ను (Nitin) చుట్టముట్టి తుపాకీలతో కాల్పులు జరుపుతుండగా.. వీధిలో ఆడుకుంటున్న పిల్లలు భయపడి పరుగులు తీశారు. గోల గమనించి సమీపంలోని ఇంటి నుంచి బయటకు వచ్చిన ఓ మహిళను దుండగులు తుపాకీతో బెదిరించారు. ఈ తతంగమంతా అక్కడ అమర్చిన ఓ సీసీ కెమెరాలో రికార్డయింది(Greater Noida). ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరలైంది.

Read Also: కామారెడ్డి జిల్లాలో అరుదైన వేడుక.. ట్విన్ బ్రదర్స్‌ను పెళ్లాడిన ట్విన్ సిస్టర్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!