బ్యానర్లు, ప్లెక్సీల ఏర్పాటు : TVK కీలక ఆదేశాలు!

కలం, వెబ్ డెస్క్‌ : తమిళగ వెట్రి కళగం (TVK Party) అధినాయకత్వం తన పార్టీ శ్రేణులకు కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. సామాన్యులకు ఇబ్బంది కలిగించే ఏ చర్యను సహించబోమని స్పష్టం చేసింది. ముఖ్యంగా పుట్టినరోజు వేడుకలు లేదా కుటుంబ శుభకార్యాల సందర్భాల్లో వీధులు, బహిరంగ ప్రదేశాలలో భారీ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది.

జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో రాకపోకలకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించడం క్రమశిక్షణారాహిత్యమేనని ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తరుణంలో, సామాన్యుల సౌకర్యాన్ని పణంగా పెట్టి చేసే వేడుకలకు దూరంగా ఉండాలని సూచించారు. పార్టీ నిబంధనలను అతిక్రమించి, ప్రజలకు అసౌకర్యం కలిగించేలా బ్యానర్లు కట్టినా లేక అతిగా ప్రవర్తించినా అటువంటి వారిపై పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధిష్టానం హెచ్చరించింది. క్రమశిక్షణతో కూడిన రాజకీయ ప్రయాణమే లక్ష్యమని ఈ ప్రకటన ద్వారా టీవీకే (TVK Party) స్పష్టం చేసింది.

Read Also: వన్యప్రాణులకు రక్షణ : ఢిల్లీ వేదికగా IBCA సదస్సు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>