Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీలో నేటి నుంచి రెండు రోజులపాటు కలెక్టర్ల సదస్సు

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని సెక్రటేరియట్ లో గురువారం నుంచి రెండ్రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరుగనుంది. ఈ-ఆఫీస్ విధానానికి ప్రాధాన్యమిస్తోన్న ఏపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో ప్రజా ఫిర్యాదులు, దరఖాస్తుల పరిష్కారం అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజల సంతృప్తి స్థాయి, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపైనా చర్చించనున్నారు. పాలనలో ప్రభుత్వ సమర్థత మరింత మెరుగుపరిచేదిశగా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. తొలిరోజు స్వర్ణాంధ్ర పది సూత్రాలు, జిల్లాల వారీగా జీఎస్‌డీపీ గ్రోత్‌, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఫిర్యాదుల పరిష్కారం, పెట్టుబడులపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. రెండోరోజు సంజీవని, ఎండాకాలం దృష్ట్యా సమ్మర్ యాక్షన్ ప్లాన్, సూపర్ సిక్స్‌ అంశాలపై చర్చించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>