టీవీకే మేనిఫెస్టో విడుదల చేసిన విజయ్

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు (Tamil Nadu) లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో టీవీకే అధినేత విజయ్ (TVK chief Vijay) తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలు కీలక హామీలను ప్రకటించారు. ప్రతి ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని, 60 ఏళ్లలోపు ఉన్న మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందించనున్నట్లు మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

పేద కుటుంబ అమ్మాయిల వివాహానికి 8 గ్రాముల బంగారం, పట్టుచీర అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల తల్లుల ఖాతాల్లో ప్రతి ఏడాదికి రూ.15,000 జమ చేస్తామని ప్రకటించారు. ఈ హామీలు మహిళలు, పేద కుటుంబాలు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని రూపొందించినట్లు టీవీకే (TVK) పేర్కొంది. ఎన్నికల ముందు ఈ మేనిఫెస్టో తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>