కలం, వెబ్ డెస్క్: సెన్సార్ బోర్డు నూతన ఛైర్మన్‌గా శశి శేఖర్ వెంపటి (Shashi Shekhar Vempati) నియమితులయ్యారు. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న ప్రసూన్ జోషిని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సి) ఛైర్మన్‌గా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. క ఆగా, సెన్సార్ బోర్డు ఛైర్మన్ పదవిని ఇప్పటివరకు రాజకీయ సంబంధిత వ్యక్తులే కట్టబెడుతూ వస్తుండగా.. తొలిసారి బయట వ్యక్తిని నియమించడం ఇదే మొదటిసారి.
ఇన్నోవేటర్ నుంచి సెన్సార్ బోర్డ్ ఛైర్మన్ వరకు..
ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి అయిన శశి శేఖర్ వెంపటి.. కార్పొరేట్ మేనేజ్ మెంట్, మీడియా కన్సల్టెన్సీలో సుదీర్ఘ అనుభవం ఉంది. డిజిటల్ ఇన్నోవేటర్ గా ఆయన అమెరికాలో రెండు పేటెండ్లు సాధించారు. 2017లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తొలిసారి ఆయన్ను ప్రసారభారతి సీఈవోగా అయిదేళ్లు పాటు నియమించింది. 1997లో ప్రసారభారతిని ప్రారంభించినప్పటి నుంచి, ఈ పదవిని చేపట్టిన వారిలో ఆయన అత్యంత పిన్న వయస్కుడు ఆయనే. 2017 ఆగస్టు నుంచి 2019 మే వరకు రాజ్యసభ ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు. తాజాగా, సెన్సార్ బోర్డు ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది.

