ఇక్రిశాట్‌లో నేడు తుమ్మల సమీక్ష.. రైతు ఉత్సవాలపై దిశానిర్దేశం

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌లో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) సమీక్ష నిర్వహించనున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించే రైతు ఉత్సవాలపై మంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో పంటల కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్​కు ఏ విధంగా సిద్ధం కావాలో అధికారులకు వివరించనున్నారు. అలాగే సాయిల్ హెల్త్ వాలంటీర్ల శిక్షణ కార్యక్రమం కోసం ఇక్రిశాట్​కు రానున్న కొడంగల్ రైతులతో మంత్రి సమావేశమై చర్చించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>