కలం వెబ్ డెస్క్ : తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో సామాన్య భక్తుల సౌకర్యం కోసం టీటీడీ(TTD) మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి అభిషేక సేవ జరుగుతున్న సమయంలోనే సర్వ దర్శనం భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు అభిషేకం సమయంలో దర్శనం నిలిపివేస్తుండగా ఇప్పుడు ఎక్కువ మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మరోవైపు, నేటి నుంచి టోకెన్ లేని భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి నేరుగా భక్తులను అనుమతిస్తున్నారు. జనవరి 8 వరకు టోకెన్ లేకుండానే సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు.


