Mobile Popup Ad
Mobile Popup Ad

TET అర్హత మార్కులు తగ్గించండి.. ప్రభుత్వానికి TSUTF రిక్వెస్ట్

కలం, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన టీఎస్ టెట్ ఫలితాలపై తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (TSUTF) రియాక్ట్ అయ్యింది. ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు కచ్చితంగా టెట్ ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధనతో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొంది. తాజాగా విడుదలైన ఫలితాల్లో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు 57.76 శాతం ఉత్తీర్ణతతో మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, జనరల్ కేటగిరీకి చెందినవారు 60 శాతం మార్కులు సాధించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. వయస్సు పైబడటం, చాలా కాలం తర్వాత పరీక్ష రాయడం వల్ల ఆశించిన మార్కులు సాధించలేకపోయారని గుర్తుచేసింది.

ఉద్యోగ విరమణ ముప్పు ఉన్న ఉపాధ్యాయులను (Teachers) రక్షించేందుకు ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించాలని (TSUTF) కోరింది. దశాబ్దాలుగా విద్యారంగానికి సేవలందించిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెల్పింది. క్వాలిఫైయింగ్ మార్కుల విషయంలో తగిన సడలింపులు ఇవ్వాలని కోరింది. లేకుంటే సీనియర్ ఉపాధ్యాయులు బలవంతపు పదవీ విరమణ ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇది ఉపాధ్యాయ కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేసింది.

Read Also: క్యాంప్ పాలిటిక్స్.. పార్టీల కౌంటర్ స్ట్రాటెజీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>