నల్లగొండలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆందోళన

కలం, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో వెంటనే 124 ప్రీ ప్రైమరీ సెక్షన్లలో నిర్దేశకులు, ఆయాలను తక్షణమే నియమించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) డిమాండ్ చేసింది. నియామక ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. టీఎస్‌యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యాబోధన ప్రారంభించినా.. జిల్లా స్థాయి అధికారులు నియామకాలను పూర్తి చేయకపోవడం శోచనీయమన్నారు. 124 మంది నిర్దేశకులు, ఆయాల నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చి రెండు నెలలవుతున్నా నేటికీ ప్రక్రియను ముగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయులపై అదనపు భారం..

ప్రీ ప్రైమరీలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఆయా పాఠశాలల్లో చేరిన విద్యార్థుల విద్యాబోధన దెబ్బతింటోందని, ఉన్న ఉపాధ్యాయులపై అదనపు భారం పడుతోందని పెరుమాళ్ల వెంకటేశం తెలిపారు. రాజకీయ నాయకుల ఒత్తిడి కారణం చూపి నియామక ప్రక్రియను నిలిపివేయడంలో అర్థం లేదన్నారు. అధికారులు చట్టానికి లోబడి బాధ్యతాయుతంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు బక్కా శ్రీనివాస చారి, ఎఫ్‌డబ్ల్యూ‌ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎడ్ల సైదులు, జిల్లా కోశాధికారి వడ్త్య రాజు, జిల్లా కార్యదర్శులు యాట మధుసూదన్ రెడ్డి, గేర నరసింహ, మోర్తాల శ్రీనివాసరెడ్డి, మురళయ్య, నలపరాజు వెంకన్న, ఏ చిన్న వెంకన్న, కొమరాజు సైదులు, ఆడిట్ కమిటీ సభ్యులు నరసింహమూర్తి, పూర్వ రాష్ట్ర కార్యదర్శి నర్రా సరళ, భాను ప్రకాష్, సోషల్ మీడియా కన్వీనర్ యరనాగుల సైదులు, రాగి రాకేష్, సి.హెచ్.రవీందర్, దాసరి ప్రభాకర్, పద్మ, రమణమ్మ, సూర్య కళ, సంధ్య, రమణ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>