గోదావరి పుష్కరాల పనుల్లో వేగం పెంచాలి: శైలజా రామయ్యర్

కలం, ఖమ్మం బ్యూరో: రానున్న గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) కోసం చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ (Shailaja Ramaiyer) అధికారులను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా, ఎక్కడా నాణ్యతలో రాజీ పడకుండా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు.

​శనివారం సాయంత్రం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి పలు జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఐడీఓసీ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) ఈ సమావేశంలో పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా పుష్కరాల కోసం జరుగుతున్న ఏర్పాట్ల పురోగతిని జిల్లాల వారీగా సమీక్షించిన ప్రిన్సిపల్ సెక్రటరీ… నూతన పుష్కర ఘాట్ల నిర్మాణం, ఇప్పటికే ఉన్న ఘాట్ల మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.

పుష్కరాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పక్కా ప్రణాళికతో సురక్షితమైన తాగునీటి సరఫరాను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ​అలాగే, పుష్కర ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టడంతో పాటు, భక్తులను ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన లైటింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పుష్కరాల ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ​ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈఓ దామోదర్ రావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>