వాట్సాప్ గ్రీవెన్స్ సెల్‌ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

కలం, ఆదిలాబాద్ : ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రీవెన్స్ సెల్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Rajasrhi Shah) సూచించారు. ప్రజలు తమ సమస్యలు, ప్రభుత్వ సేవల అందజేతలో జాప్యం, ఇతర ఫిర్యాదులను 9492341947 వాట్సాప్ నంబర్‌కు పంపవచ్చని తెలిపారు. ఈ నంబర్ ద్వారా అందిన ఫిర్యాదులు, వాటి పరిష్కార పురోగతిపై శనివారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖల అధికారులు ప్రాధాన్యతతో స్వీకరించి, వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. ఫిర్యాదులను కేవలం స్వీకరించడానికే పరిమితం కాకుండా, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టి, పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉట్నూర్ సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి స్రవంతి, ఫిర్యాదుల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>