Mobile Popup Ad
Mobile Popup Ad

యుద్ధం మళ్లీ షురూ..?.. ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్ తో శనివారం శాంతి చర్చలు జరిపేందుకు అమెరికా సన్నద్ధం అవుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. లెబనాన్ లో కాల్పుల విరమణ, ఇరాన్ నిరోధిత ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ రెండు కొత్త డిమాండ్లు తెరపైకి తీసుకొచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

న్యూయార్క్ పోస్టులో దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. ”డీల్ కుదరకపోతే మళ్లీ దాడులు షురూ చేస్తాం. ఇరాన్ పై దాడి చేయడానికి యుద్ధ నౌకలలో అత్యుత్తమ ఆయుధాలను తిరిగి నింపుతున్నాం. గతంలో ఉపయోగించిన వాటికంటే మెరుగైన ఆయుధాలతో వారిని పేల్చేస్తాం” అంటూ హెచ్చరించారు. శనివారం నుంచి ప్రారంభం కావాల్సిన చర్చలకు కొన్ని గంటల ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో శనివారం జరగాల్సిన శాంతి చర్చల్లో ఇరాన్ పాల్గొంటుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>