టీవీకే విశ్వరూపం చూపిస్తాం : సీఎం విజయ్​

కలం, వెబ్​ డెస్ : త్వరలో టీవీకే (TVK) పార్టీ విశ్వరూపం చూపిస్తాం అని తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత దళపతి విజయ్ (CM Vijay)​ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కరూర్ లో పర్యటించిన ఆయన కరూర్​ తొక్కిసలాట బాధితులను పరామర్శించారు. సీఎం హోదాలో తొలిసారి కరూర్​ లో పర్యటించారు. ఈ సందర్బంగా టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన 41 మంది కుటుంబాలకు చెందిన 32 మంది సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను విజయ్ అందజేశారు.

ఈ సందర్బంగా విజయ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. కరూర్​ టీవీకే సభలో తొక్కిసలాట జరుగుందని ప్రభుత్వానికి ముందే తెలుసని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అయినా తమను కరూర్​ పోలీసులు అప్రమత్తం చేయలేదని సీఎం (CM Vijay)​ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితంలో అతిపెద్ద విషాదం కరూర్​ తొక్కిసలాట అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కరూర్​ ఘటనలో (Karur Stampede) రాజకీయ కుట్ర కోణం ఉందని విజయ్​ ఆరోపించారు. అవినీతి చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. అలాగే, డీలిమిటేషన్​ పై స్పందించిన సీఎం విజయ్​.. ఈ ప్రక్రియకు తాము వ్యతిరేకం అని స్పష్టం చేశారు. కాగా, గత ఏడాది (2025 సెప్టెంబర్‌లో టీవీకే (TVK) ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే.

Read Also: నాకు తెలంగాణ ఫస్ట్​.. తరువాతే పార్టీ : ఈటల కీలక వ్యాఖ్యలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>