కరీంనగర్‌లో తెలంగాణ రక్షణ సేనను బ‌లోపేతం చేస్తాం: గుంజపడుగు హరిప్రసాద్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా తెలంగాణ రక్షణ సేన (Karimnagar TRS) ముఖ్య నాయకుల సమావేశం గురువారం హొటల్ మహతి కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌ను కరీంనగర్ జిల్లాలో బలోపేతం చేయాల‌ని, త్వరలోనే అన్ని స్థాయిల్లో జిల్లా, మండల, గ్రామ కమిటీలను వేయాల‌ని నిర్ణయించిన‌ట్లు తెలిపారు. అదే విధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు మే 20 నుండి జూన్ 20 వరకు జెండా పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. అదే విధంగా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రజా సమస్యల మీద టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాల‌ని తీర్మానం చేసిన‌ట్లు తెలిపారు.

తెలంగాణలో ఉన్న ప్రజలు సర్వతోముఖాభివృద్ధి చెందాలని, దానికి సరైన వేదిక తెలంగాణ రక్షణ సేన అని హ‌రి ప్ర‌సాద్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ భావజాలాన్ని రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాల‌ని సూచించారు. కరీంనగర్ జిల్లాలో వచ్చే నెల రోజుల పాటు వాడవాడనా టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ సభలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించిన పాంచజన్య సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు లింగంపల్లి నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అంకం శివరాణి, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేష్, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, చంటి శ్రీనివాస్, బుడిగె పర్శరాం గౌడ్, బండమీద అంజయ్య, గుండేటి తిరుపతి, బసవేణి రాజేందర్, పిన్నింటి సంగీత రెడ్డి, మడిపెల్లి వినీత్, ఎండీ సల్మా, జంగ అపర్ణ, ముప్ప విజేయ్, వారాల శ్రీనివాస్, కొత్తపల్లి తిరుపతి, మ్యాక వినోద్, గాలిపెల్లి రత్నాకర్ చారి, నవ్య, కొమిరి పద్మ, మహేష్, బుర్ర నటరాజ్ గౌడ్, సురేష్, సంతోష్ యాదవ్, దీటి శిరీష రమేష్, బండ అశోక్, అంబాల హరిష్, కొత్తురి నరేష్, ఎండీ హుస్సేన్, ఎండీ బషీర్, తూముల భిక్షపతి, పూసాల పవన్, ఎండీ రాజీ, అంజలి, కుతాడి రజిత, పల్లె శారద, పోతన రూప, నగునురి రమేష్ చారి, శారద తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>