TRS నాకు రాసిపెట్టి ఉందేమో! : పార్టీ పేరు ఆమోదంపై కవిత రియాక్షన్‌

కలం, వెబ్‌ డెస్క్‌ : తెలంగాణ రక్షణ సేన (TRS) పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్సీ కవిత (Kavitha) తన స్పందన తెలియజేశారు. తన రాజకీయ ప్రయాణంలో టీఆర్ఎస్ అనే పేరు మరోసారి తోడవటం కేవలం యాదృచ్ఛికం కాదని, ‘TRS నాకు రాసిపెట్టి ఉందేమో!!’ అంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూనే తన భవిష్యత్ కార్యాచరణను స్పష్టం చేశారు. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని కాపాడటం కోసం, అస్తిత్వ పరిరక్షణ కోసం తాను చేస్తున్న పోరాటాన్ని ఇకపై కూడా అదే అంకితభావంతో కొనసాగిస్తానని కవిత (Kavitha) హామీ ఇచ్చారు.

పార్టీ పేరు ఎంపిక వెనుక ఉన్న అసలు విషయాన్ని సైతం కవిత బయటపెట్టారు. జనవరి 2026లో కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తాము మొత్తం ఐదు పేర్లను దరఖాస్తు చేశామని ఆమె వివరించారు. అందులో మూడవ ప్రాధాన్యతగా ఇచ్చిన పేరునే ఈసీ ఖరారు చేయడం కేవలం యాదృచ్ఛికమని ఆమె పేర్కొన్నారు. నూతన పార్టీగా టీఆర్ఎస్ పేరు రావడం తెలంగాణ సమాజానికి గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

Read Also: నిద్రపోయే ముందు ఫోన్ వాడుతున్నారా? మీ మెదడుకు ప్రమాదమే!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>