కలం , కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘకాలం పాటు విశేష సేవలందించిన ఏడుగురు పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మాన కార్యక్రమం గురువారం కరీంనగర్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. కరీంనగర్ వన్ టౌన్ ఎస్సై ఏ సత్యనారాయణ, సీఎస్బీ ఎస్సై డి శ్రీనివాస్, ఏఆర్ విభాగం నుండి సర్ధార్ భగవాన్ సింగ్, మానకొండూరు ఏఎస్సై ఖాజా జమాలుద్దీన్ , ఏఆర్ ఎస్సై పి లక్షయ్య , కొత్తపల్లి ఏఎస్సై హెచ్ వెంకటరమణ, ఏఆర్ అట్టాచ్డ్ హెడ్ కానిస్టేబుల్ రంగస్వామి లు పదవీ విరమణ పొందారు. కరీంనగర్ అడీషనల్ డీసీపీ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై పదవీ విరమణ పొందిన అధికారులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ.. అనేక సవాళ్లతో కూడుకున్న పోలీస్ ఉద్యోగాన్ని విజయవంతంగా, నిబద్ధతతో పూర్తి చేసి పదవీ విరమణ పొందడం ఒక గొప్ప విజయమని కొనియాడారు. అధికారులు అందించిన సేవలకు వారి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకమని, ఆ సహకారం వల్లే వారు సమర్థవంతంగా పనిచేయగలిగారని గుర్తు చేశారు. పదవీ విరమణ తర్వాత అధికారులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. అడిషనల్ డీసీపీ పదవీ విరమణ పొందిన వారికి పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించారు. వారికి జ్ఞాపికలను అందజేసి, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజర్వు ఇన్స్పెక్టర్ (సంక్షేమం) కిరణ్ కుమార్ , కరీంనగర్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులుడు ఎస్సై మామిడి సురేందర్, ఆర్‌ఎస్సై తిరుపతి , ఇతర అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Read Also: టోఫు తింటేనే ఆడవారిని గౌరవించినట్లా..? నెట్టింగ్ మరో వింత థీరీ..
Follow Us On : WhatsApp

