కలం, వెబ్ డెస్క్: శంషాబాద్ విమానాశ్రయంలో నిన్న రాత్రి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రయాణిస్తున్న ఇండిగో విమానం ఢిల్లీ నుంచి వస్తూ శంషాబాద్‌లో ల్యాండింగ్ అవుతున్న సమయంలో మళ్లీ టేకాఫ్ తీసుకుంది. సుమారు 20 నిమిషాల పాటు గాలిలోనే చక్కర్లు కొట్టిన ఫ్లైట్.. ఏటీసీ అనుమతి ఇవ్వడంతో సురక్షితంగా ల్యాండ్ అయింది.
సీఎం సహా అంతా సేఫ్..
విమానంలో సీఎం రేవంత్ రెడ్డి సహా సుమారు 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అందరూ సురక్షితంగానే దిగారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ల్యాండ్ అవుతున్న క్రమంలో మళ్లీ ఎందుకు టేకాఫ్ చేశారనేది ఇంకా కారణాలు వెల్లడి కాలేదు.

