కలం, నిజామాబాద్ బ్యూరో: ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (Sriram Sagar Project) లోకి వరద పెరిగింది. 9,240 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 1091 అడుగులు అంటే 80.5 TMC లు కాగా 1065.80 అడుగులకు చేరుకుంది. 17.103 TMC లకు చేరుకుంది. 751 క్యూసెక్కుల అవుట్ ఫ్లో అది కూడా మిషన్ భగీరథ నీటి అవసరాల కోసం మాత్రం నీటిని విడుదల వదులుతున్నారు.
గతేడాది ఇదే రోజు 1075 అడుగులు అంటే 32 TMC లుగా ఉంది. నిజామాబాద్ జిల్లాతో పాటు ఎగువ మహారాష్ట్రలో అలాగే గోదావరి క్యాచ్ మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద క్రమంగా పెరుగుతోంది. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మరింతగా ఇన్ ఫ్లో పెరగనుంది. నిజామాబాద్ జిల్లాతో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి బేసిన్ లో జలకళ కనిపిస్తోంది. క్రమంగా వరద పెరుగుతుండటంతో ఆయకట్టు ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి.

