ఫార్ములా ఈ – రేస్ విచారణ.. కేటీఆర్ హాజరుపై ఉత్కంఠ!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ–రేస్ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేపటి నుంచి ఏసీబీ కోర్టులో ఇరు పక్షాల వాదనలు జరగనున్నాయి. దీనిలో ప్రధాన నిందితుడిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఉన్నారు. ఏ2గా అర్వింద్ కుమార్, ఏ3గా మాజీ చీఫ్​ ఇంజినీర్‌‌ బీఎల్ఎన్ రెడ్డిగా ఏసీబీ పేర్కొంది. కేసు నమోదు చేసినప్పటి నుంచి ఇదే తొలి ట్రయల్ కావడం గమనార్హం. దీనికి కేటీఆర్ హాజరవుతారా.. లేదా.. అనేది ఉత్కంఠగా మారింది.

కేసు నేపథ్యం ఇదే..

2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఫార్ములా ఈ–రేస్ నిర్వహించింది. ఈ క్రమంలోనే రేస్ నిర్వహణ కోసం ప్రభుత్వ అనుమతి లేకుండానే ఫార్ములా ఈ–ఆపరేషన్స్ సంస్థకు రూ.54 కోట్లు చెల్లించారనేది ప్రధాన అభియోగం. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్.. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండీఏ నుంచి ఈ నిధులను బదిలీ చేయించారని ఏసీబీ వెల్లడించింది. ఇక్కడే అక్రమాలు జరిగాయని కేసు నమోదు చేసి.. పలుమార్లు కేటీఆర్‌ను విచారించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>