కలం, కరీంనగర్ బ్యూరో: గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన పార్టీ (TRS Party) కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ చౌక్‌లో కట్టెల పొయ్యి మీద వంటా వార్పుతో వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ఒకవైపు ఆడవారికి అండగా ఉంటామని బూటకపు ప్రచారం చేస్తూ గ్యాస్ ధరలు పెంచి కట్టెల పొయ్యి దిక్కయ్యే విధంగా చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలను మూడు నెలల్లోనే మూడు విడతలుగా పెంచి బడుగు బలహీన వర్గాల నడ్డి విరిచే విధంగా పని చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించి నిరుపేద ప్రజలకు అండగా ఉండాలని కోరారు. లేనిపక్షంలో తెలంగాణ రక్షణ సేన (TRS Party) ఆధ్వర్యంలో జిల్లాలో పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ఉంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు అంకం శివరాణి, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, విద్యార్థి సంఘం జిల్లా నాయకులు చెన్నమల్ల చైతన్య, జిల్లా నాయకులు బుడిగె పరుశురాం గౌడ్, బసవేణి రాజేందర్, గాలిపెల్లి రత్నాకర్ చారి, జంగా ఆపర్ణ, కుతాడి రజిత, దాసరి అంజలి, లింగంపల్లి శ్రీనివాస్, కుతాడి పరుశురాం, నూతి సాయి చరణ్, శివసారం రాజ్ కుమార్, కొలిపాక గౌతమి, పల్లె శారద, గుగులోతు దివ్య, ద్యావ శారద, పూసాల పవన్ కుమార్, గుంజపడుగు పవన్ కుమార్, సబ్బు నాగరాజు, కొండపాక రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
Read Also: రాహి సర్ణోబత్‌కు జాతీయ సెలక్షన్ ట్రయల్స్‌లో స్వర్ణం
Follow Us On: Sharechat

