నిజామాబాద్‌లో కవిత పర్యటన.. పరామర్శలు, పెళ్లి వేడుకలతో బిజీ!

కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ రక్షణ సేన(TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) నిజామాబాద్‌లో పర్యటించారు. పలువురి వివాహ వేడుకలకు హాజరు అవ్వడంతో పాటు మరికొందరిని పరామర్శించారు. నిజామాబాద్ ప్రగతి నగర్‌లోని ఫ్రూడెన్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఒక్కెర్ల అవంతి కుమార్‌ను పరామర్శించారు.

అవంతి కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం పలు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Also Read : ఆదాయానికి మించి ఆస్తులు.. అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>