కలం, వెబ్‌డెస్క్: తెలంగాణలో మరోసారి ఏసీబీ (Telangana ACB) అధికారులు దాడులు ముమ్మరం చేశారు. తాజాగా మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారి గుండు వాణి (Gundu Vani) ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. కొన్ని నెలల క్రితం వాణి ఓ లంచం కేసులో పట్టుబడ్డారు. ఇదే సమయంలో ఆమెపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అధికారులు సోమవారం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఉన్న వాణి నివాసంతో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆమెకు సంబంధించిన ప్రదేశాల్లో మొత్తం ఏకకాలంలో పది చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగంలో పని చేస్తున్న వాణి తన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆస్తులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు.
గత సెప్టెంబర్ 30న రూ.75 వేల లంచం తీసుకుంటూ వాణి(Gundu Vani), మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న యాలమోని సుదర్శన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు వాణి లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆమె తరఫున సుదర్శన్ ఆ మొత్తాన్ని తీసుకుంటూ పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. ఆయన వద్ద నుంచి రూ.75 వేల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరినీ అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు చేపట్టడంతో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read : వైభవ్.. సచిన్ అవుతాడా? కాంబ్లీ అవుతాడా?: కపిల్ దేవ్
Follow Us On : WhatsApp

