కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ ఉద్యమ పోరాటం, అస్థిత్వం, ఆత్మగౌరవం, ఉద్యమ ఆకాంక్షలు – భవిష్యత్ కార్యాచరణ అనే అంశం పై తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఈనెల 18న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. కరీంనగర్ (Karimnagar) లోని EN గార్డెన్స్ లో ఉదయం 10 గంటల నుండి ఈ సమావేశం నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ జిల్లా బాద్యులు గుంజపడుగు హరి ప్రసాద్ తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కవిత (TRS Chief Kavitha) హాజరు కానున్నారని తెలిపారు.
కావున ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యమకారులను, వివిధ రాజకీయ పార్టీల నాయకులను, ప్రజా సంఘాల ప్రతినిధులను, మేధావులను, బీసీ సంఘాల నాయకులను, కుల సంఘాల నాయకులను, మహిళ సంఘాల ప్రతినిధులను, కార్మిక సంఘాలను, రైతు సంఘాలను, విద్యార్థి, యువజన సంఘాలను, కవులు, కళాకారులు, రచయితలు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడిని ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు తెలంగాణ ఆత్మగౌరవ పరిరక్షణ కోసం తమ అభిప్రాయాలతో పాటు భవిష్యత్త్ చెప్పటబోయే కార్యచరణ పైన సమాలోచనలు చేసే విధంగా వారి అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని టీఆర్‌ఎస్ కరీంనగర్ బాద్యులు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.
Read Also: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ముంబై తాత స్టోరీ!
Follow Us On: Instagram

