Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం రేవంత్ పై కవిత ఫైర్

కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వాణి ఏర్పాటు చేసినా సీఎంకి ప్రజలతో కలవడానికి తీరిక లేదని విమర్శించారు. సచివాలయం ఉన్నా.. సీఎం అక్కడికి రావడం లేదన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, ఎంసీఆర్ హెచ్ఆర్డీకీ వెళ్తున్నారని విమర్శించారు. అలాగే, హైడ్రాతో పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చుతుందన్నారు. కానీ, మంత్రులు, వారి కుటుంబ సభ్యుల దగ్గరకు హైడ్రాను పంపరని ఆరోపించారు.

బతుకమ్మ కుంటను చూపించి.. ప్రారంభించారని కానీ, సుప్రీం కోర్టు తీర్పుతో ఏం చేస్తారని కవిత ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఆలోచనతో పాటు ముందు చూపు లేదని ఆమె ఎద్దేవా చేశారు. ఇంకా ఎన్నికలకు వెయ్యి రోజుల టైం ఉందని చెప్పారు. కాలికి గజ్జెలు కట్టుకుని తీరుగుతూ.. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపుతామని కవిత హెచ్చరించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>