కలం, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తమ సినిమా చూడాలని, ఈ సినిమా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందని సీనియర్ నటుడు నరేశ్ (Actor Naresh) అన్నారు. రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ రాజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ క్రేజీ కళ్యాణం (Crazy Kalyanam). ప్రముఖ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, సీనియర్ యాక్టర్ నరేశ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు.
భద్రప్ప గాజుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను నేడు హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. ఈ సినిమా తెలంగాణ సంస్కృతిని గొప్పగా చాటిచెప్పే విధంగా ఉంటుందని, తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డికి ఈ సినిమా చూపించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. చాలా మంది కొత్త వాళ్లతో కలిసి పని చేశానని, ఈ సినిమా (Crazy Kalyanam) తప్పకుండా మంచి రిజల్ట్ సాధిస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు. ఇక అఖిల్ రాజ్‌తో నటించడంపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తనకు హీరో ఎవరైనా ఎలాంటి సమస్య లేదని, చిన్న హీరో అని తక్కువ చేసే ఉద్దేశం లేదని చెప్పారు.
క్యారెక్టర్‌కు ఎవరు సూట్ అవుతారని అనిపిస్తారో డైరెక్టర్ వాళ్లనే తీసుకుంటారని చెప్పారు. అఖిల్ నటించిన సినిమాలు చూడలేదు కానీ, తనతో పని చేయడం సరదాగా అనిపించిందని చెప్పారు. అఖిల్ రాజ్ మాట్లాడుతూ.. అనుపమ తనకు చాలా సపోర్ట్‌గా ఉందని, చిన్న హీరో అని ఎప్పుడూ తక్కువగా చూడలేదని చెప్పారు. టీజర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఆకట్టుకుంటుండగా మూవీ టీం ఇంకా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించలేదు.
Also Read : ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఈ తప్పులు చేయకండి!.. నిపుణుల హెచ్చరిక
Follow Us On: Sharechat

