వ‌ట్‌ప‌ల్లిలో పీఎస్‌పై ద‌ర‌ఖాస్తుప‌ల్లి గ్రామ‌స్తుల దాడి

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి పోలీస్ స్టేషన్ (Vatpally PS) పరిధిలో ఓ యువకుడి అనుమానాస్పద మృతి ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు, ప్రజల ఆగ్రహానికి దారితీసింది. వ‌ట్‌ప‌ల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక దాబాలో పని చేస్తున్న దరఖాస్తుపల్లి గ్రామానికి చెందిన బీరప్ప (22) అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే, యువకుడి మృతికి సంబంధించి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పోలీసులు మృతదేహాన్ని చెట్టుపై నుండి కిందకు దించడం వివాదానికి కారణమైంది.

కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా, వారి సమక్షంలో కాకుండా మృతదేహాన్ని చెట్టు పైనుంచి ఎలా కిందకు దించుతారంటూ దరఖాస్తుపల్లి గ్రామస్తులు, మృతుడి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, దాబా నిర్వాహకుల వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున వట్ పల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగారు. స్టేషన్‌లోని ఫర్నీచర్, కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Also Read : ప‌వ‌న్ భార్య దాతృత్వం.. బ‌ర్త్‌డే రోజు ఏం చేసిందంటే?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>