కలం, వెబ్ డెస్క్ : దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన డీలిమిటేషన్ మోడల్ పై తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత్రి కల్వకుంట్ల కవిత (Kavitha) సంచలన ప్రతిపాదన చేశారు. ఈ మేరకు మీడియా సమావేశంలో డీలిమిటేషన్ (Delimitation) పై ఆమె స్పందిస్తూ.. భారత దేశ రాజ్యసభకు అమెరికా తరహా పవర్ కల్పించాలని సూచించారు. ఇందులో భాగంగా రాజ్యసభలో రాష్ట్రానికి ఫిక్స్ డ్ సభ్యులు ఉండాలని చెప్పారు. అటు లోక్ సభలో ఎంపీలను జనాభా ప్రకారం డివైడ్ చేసుకోవచ్చన్నారు. ఏదైతే రాష్ట్రానికి 7 లేదా 8 లక్షల బెంచ్ మార్క్ పెట్టుకుని ఎంపీ సంఖ్యలను పెంచుకోవచ్చని సూచించారు. ఈ విషయంపై ప్రధాని మోదీకి త్వరలో లేఖ రాయబోతున్నట్లు వివరించారు.
జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్ జరిపి లోక్ సభలో ఎంపీలను పెంచితే కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆమె (Kavitha) స్పష్టం చేశారు. అదే రాజ్యసభ కు పవర్ ఉండేలా చేస్తే అన్ని రాష్ట్రాలకు మేలు జరుగుతుందని తెలిపారు. రాజ్యసభలో ప్రస్తుతం యూపీకి 32 సీట్లు ఉంటే సిక్కింకు ఒకే సీటు ఉందని గుర్తు చేశారు. అలా కాకుండా ప్రతీ రాష్ట్రానికి ఫిక్స్ డ్ సంఖ్యలో రాజ్యసభ సభ్యులు ఉంచాలన్నారు. సెనేట్ తరహాలో రాష్ట్రాలు అంగీకరించకపోతే బిల్లులు ఆగిపోయే వ్యవస్థగా రాజ్యసభ రూపాంతరం చెందాలని ఆకాంక్షించారు. రాజ్యసభలో ఇలాంటి పరిస్థితులు ఉంటేనే రాష్ట్రాల ప్రయోజనాలు నెరనేరుతాయని పేర్కొన్నారు.
Read Also: బీజేపీని కార్నర్ చేసేందుకు కాంగ్రెస్‌కు అస్త్రం
Follow Us On : WhatsApp

