Mobile Popup Ad
Mobile Popup Ad

త్రివిక్రమ్ తరువాత మూవీ.. ఎన్టీఆర్ ఫిక్స్ అయినట్లేనా?

కలం, వెబ్ డెస్క్: త్రివిక్రమ్ ఓ భారీ మైథాలాజికల్ మూవీ తీయబోతున్నట్లు ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. హీరో ఎవరనేది ఇప్పటివరకు క్లారిటీ లేకపోయినా.. తాజాగా ఎన్టీఆర్ (NTR) ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఈ నెల 20 తారక్ బర్త్ డే సందర్భంగా వీడియోతో కొత్త ప్రాజెక్ట్ గురించి ప్రకటించబోతున్నారని సమాచారం. గాడ్ ఆఫ్ వార్ పేరిట తెరకెక్కే ఈ మూవీ.. కార్తికేయ కథకు సంబంధించినది టాక్. ఇటీవలే ఎన్టీఆర్ ముంబయి నుంచి వస్తుండగా.. ఆయన చేతిలో కార్తికేయ పుస్తకం కూడా కనిపించింది. ఆ క్యారెక్టర్ గురించి స్టడీ చేసేందుకే ఈ పుస్తకాన్ని త్రివిక్రమ్ అందించి ఉంటారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.

అల్లు అర్జున్ డేట్స్ ఖాళీ లేకనే..

వాస్తవానికి ఈ ప్రాజెక్టును మొదట అల్లు అర్జున్‌తో తీయాలని భావించినా.. ఇప్పట్లో డేట్స్ దొరికేలా లేకపోవడంతో ఎన్టీఆర్‌కి కథ చెప్పి ఓకే చేశారట త్రివిక్రమ్. బన్నీతో తీయాలంటే మరో ఏడాదైనా పట్టే అవకాశం ఉందని.. అప్పటివరకు వేచి చూసే అవకాశం లేకపోవడంతో.. ఎన్టీఆర్ తోనే తీయాలని ఫిక్సయ్యారట. ప్రస్తుతం త్రివిక్రమ్.. విక్టరీ వెంకటేశ్‌తో కలిసి ‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ అనే మూవీ తీస్తున్నారు. ఈ వేసవి కానుకగా ఇది విడుదలయ్యే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>