కలం, వెబ్ డెస్క్: మూసీలో ప్రజలను ముంచడానికి రేవంత్ సర్కార్ చూస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆర్ఆర్ (రేవంత్ – రాహుల్) ట్యాక్స్ నడుస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ (MLA Prakash Goud) రాజేంద్రనగర్ ప్రజలకు ద్రోహం చేశారని.. ఎమ్మెల్యే పోయినా పార్టీకి ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేశారు. రాజేంద్రనగర్‌లో పార్టీ బాధ్యత కార్తీక్ రెడ్డి భుజాల మీద ఉందని చెప్పారు. ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ చేతిలో ప్రతి ఒక్కరు మోసపోయారని.. “కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలే” అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.
రేవంత్ రెడ్డి సినిమా అట్టర్‌ఫ్లాప్..
కాంగ్రెస్ ఖేల్ ఖతం.. దుకాణ బంద్ అంటూ కేటీఆర్ (KTR) దుయ్యబట్టారు. అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఫస్ట్ హాఫ్ అయ్యిందని చెప్పారు. అర్జున్ రెడ్డి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని.. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సినిమా అట్టర్‌ఫ్లాప్ అయిందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ దొంగలు భూములు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కోటి ఎకరాల భూములు అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ నేతలు దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రెవెన్యూ మంత్రి కొడుకే రౌడీయిజం చేస్తున్నాడని.. కాంగ్రెస్ పాలనలో నిజాయితీగా పనిచేసే వారికి, అధికారులకు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. 420 పాలనలో తెలంగాణ నలిగిపోతుందని దుయ్యబట్టారు.
420 హామీలు ఏమయ్యాయి?
హైదరాబాద్‌లో గతంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉండే? కాంగ్రెస్ పాలన వచ్చాక లా అండ్ ఆర్డర్ ఎలా అయిందంటూ మండిపడ్డారు. హీరో రజనీకాంత్ (Rajinikanth) హైదరాబాద్ అభివృద్ధిని మెచ్చుకున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో జీవో నెంబర్ 50 మీద పేదలకు పట్టాలు ఇచ్చామని.. కానీ కాంగ్రెస్ పాలన ఇప్పుడు కూల్చివేతలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. హైడ్రా (Hydra) ప్రజల పాలిట భూతంలా పని చేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు ఏమయ్యాయని.. 6 గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గలో ఒక్క ఇల్లు కట్టారా? అని అడిగారు. వంద రోజుల్లో అన్ని గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారని.. రెండున్నర ఏళ్లు గడిచింది ఇప్పుడు ఏమైంది? అని ప్రశ్నించారు.
రూ.4 లక్షల కోట్ల అప్పు ఏం చేశారు?
అడ్డిమారిగుడ్డి దారిలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముఖ్యమంత్రి అయ్యాడంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో 1000 గురుకుల పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌ది అని చెప్పారు. 204 మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేశారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల కరెంట్ ఇచ్చారని.. 70 లక్షల మంది రైతులకు రూ. 73 వేల కోట్లు రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అని కొనియాడారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు రూ.4 లక్షల కోట్ల అప్పు తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో చేసింది? అని ప్రశ్నించారు. ధాన్యం కొనడానికి సంచులు కూడా లేవని అన్నారు.
రాహుల్ బంధు బాగా నడుస్తోంది..
కాంగ్రెస్ పాలనలో రైతు బంధు బంద్ అయిందని.. రాహుల్ బంధు మాత్రం బాగా నడుస్తోందని చురకలు అంటించారు. ఉమ్మడి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యమకారులను తప్పక ఆదుకుంటామని చెప్పారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రక్షణ శాఖ భూములను కాపాడాలన్నారు. తెలంగాణ ఆడ బిడ్డలకు సీఎం రేవంత్ రూ.లక్ష 50 వేలు బాకీ ఉన్నాడని అన్నారు. నిరుద్యోగ భృతి ఏమైంది? అని ప్రశ్నించారు. ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై ఎవరు ఆందోళన చెందొద్దని భరోసా కల్పించారు. ఓట్లు కట్ చేస్తారని ప్రజలు భయపడుతున్నారని.. ఎవరు భయపడొద్దు అని అన్నారు.
Read Also: అడవి దారి లేక.. ఆగమవుతున్న నల్లమల గిత్త!
Follow Us On: Instagram

