Mobile Popup Ad
Mobile Popup Ad

మహారాష్ట్రలో కుప్పకూలిన శిక్షణ విమానం

కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో శిక్షణ విమానం (Training Aircraft) కుప్పకూలింది. బారామతి ఎయిర్‌పోర్ట్ సమీపంలోని గోజుబావి గ్రామంలో రెడ్‌బర్డ్ ఏవియేషన్‌కు చెందిన రెండు సీట్ల శిక్షణ విమానం ప్రమాదానికి గురైందని పుణే రూరల్ పోలీసులు వెల్లడించారు. ‘ఉదయం 8.50 గంటల ప్రాంతంలో విమానం ప్రమాదానికి గురైందని సమాచారం వచ్చింది. క్రాష్ ల్యాండింగ్ అవుతూ నియంత్రణ కోల్పోయి నేలను బలంగా ఢీకొట్టింది. అందులో ఒక్కరే పైలట్ ఉన్నట్లు సమాచారం ఉంది. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు’ అని ఎయిర్‌పోర్ట్ వర్గాలు వెల్లడించాయి.

గతంలో కూడా ఇలాగే..

ఇదే బారామతి ప్రాంతంలో గత ఫిబ్రవరిలో జరిగిన విమాన ప్రమాదంలో ఎన్సీపీ అగ్రనేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఓ ప్రైవేట్ విమానంలో ముంబయి నుంచి బారామతి వస్తుండగా.. సాంకేతిక లోపంతో ల్యాండ్ అవుతున్న క్రమంలో రన్ వే పక్కనే కూలిపోయింది. ఇటీవల కాలంలో శిక్షణ విమానాలు తరచూ కూలిపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>