Mobile Popup Ad
Mobile Popup Ad

నల్లగొండలో టీజీ ఐసెట్ ప్రశ్నాపత్రం కోడ్ విడుదల

కలం, నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న టీజీ ఐసెట్ – 2026 (TG ICET 2026) పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం కోడ్‌ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు లాటరీ పద్ధతి ద్వారా ప్రశ్నాపత్రం “బి” సెట్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీజీ ఐసెట్ చైర్మన్, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ ఆచార్య అల్వాల రవి పాల్గొన్నారు.

పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఇటికాల పురుషోత్తం, సెక్రటరీ ఆచార్య శ్రీరామ్ వెంకటేష్, ఎంజీయూ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి తదితరులు హాజరయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>