కలం, వెబ్ డెస్క్ : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Medak Accident) చోటుచేసుకుంది. నిజాంపేట మండలం నందిగామ బ్రిడ్జ్ వద్ద అర్ధరాత్రి వేళ జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు రామాయంపేట నుంచి నందిగామ వైపు బైక్పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
నందిగామ బ్రిడ్జ్ సమీపంలోకి రాగానే వాహనం అదుపుతప్పి బ్రిడ్జ్లోకి దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలై ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

