కలం, వెబ్ డెస్క్: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) ఘటన అనేక సంచలన మలుపులు తిరుగుతోంది. తోటి మహిళా ట్రైనీని వేధించినట్లు ఆరోపణలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన, పరిమితికి మించి మద్యం సేవించాడు. దీంతో అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఉదయ్ కృష్ణారెడ్డి కొద్దిసేపటి క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో ఆస్పత్రి బయట వేచి ఉన్న మీడియా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసింది. తనపై వచ్చిన వేధింపుల ఆరోపణలు, వివాదంపై మాట్లాడకుండానే అక్కడ్నుంచి మౌనంగా వెళ్ళిపోయారు. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహరంపై తెలంగాణ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తిగా మారింది.

