కలం, నల్లగొండ బ్యూరో : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా.. భర్త, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ పరిధిలోని బాలాపూర్ మండలం గుర్రంగూడ (Gurramguda) కు చెందిన పి.దుర్గ (25) భర్త, కుమారుడితో కలిసి నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు శ్రీ పార్వతి జడలరామలింగేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు.
చెరువుగట్టు (Cheruvugattu) దర్శనం చేసుకొని ఆదివారం ఉదయం తిరిగి వస్తుండగా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద వారు ప్రయాణిస్తున్న స్కూటీని వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గ అక్కడికక్కడే మృతి చెందగా.. భర్త, కుమారుడికి గాయాలయ్యాయి. వారిద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


