కలం, వెబ్ డెస్క్ : దుబాయ్ లో మూడు రోజుల పాటు చిక్కుకున్న బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు (PV Sindhu) సేఫ్ గా ఇండియాకు వచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘దుబాయ్ లో చిక్కుకున్నప్పుడు చాలా భయంకరమైన, ఒత్తిడితో కూడుకున్న పరిస్థితిలో ఉన్నాం. దాదాపు మూడు రోజుల పాటు అక్కడే చిక్కుకుపోయాం. ఆ టైమ్ లో ఎంతో టెన్షన్ పడ్డాను. భారత ప్రభుత్వం, దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆఫీస్ వల్లే మేం సేఫ్ గా ఇండియాకు తిరిగి వచ్చాం. ప్రభుత్వం సమన్వయం చేసి చర్యలు తీసుకోవడం వల్ల నాతో పాటు చాలా మంది సేఫ్ గా ఇండియాకు వచ్చాం’ అంటూ తెలిపింది పీవీ సింధు (PV Sindhu).
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంతో పశ్చిమాసియా దద్దరిల్లిపోతోంది. అన్ని గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబులతో విరుచుకుపడుతోంది. దీంతో గల్ఫ్ లో చిక్కుకున్న ఇండియన్ల కోసం భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. అక్కడి రాజులతో ఇప్పటికే ప్రధాని మాట్లాడారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు భారత ప్రభుత్వం చెబుతోంది.

