epaper
Wednesday, March 4, 2026
epaper

టీ20 వరల్డ్​ కప్​ : ఫిన్​ అలెన్​ సూపర్​ సెంచరీ.. ఫైనల్​కు కివీస్​

కలం, వెబ్​ డెస్క్​: టీ20 వరల్డ్​ కప్​ 2026లో న్యూజిలాండ్(New Zealand)​ ఫైనల్​కు చేరింది. బుధవారం సెమీస్​లో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్​కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచి మొదట బ్యాటింగ్​ చేసిన ప్రొటీస్​ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. మార్కో యాన్​సన్​(55 నాటౌట్​; 30 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్​లు) హాఫ్​ సెంచరీ చేయగా, డెవాల్డ్​ బ్రెవిస్​(34; 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్​లు), ట్రిస్టన్​ స్టబ్స్​(29; 24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్​) ఓ మోస్తరు పరుగులు చేశారు. కివీస్​ బౌలర్లలో మ్యాట్​ హెన్రీ, కోల్​ మెకెంచీ, రచిన్​ రవీంద్ర తలో 2 వికెట్లు తీశారు. జేమ్స్​ నీషమ్, ఫెర్గూసన్​ చెరో వికెట్​ పడగొట్టారు.

ఛేదనలో కివీస్(New Zealand) అదరగొట్టింది. ఓపెనర్​ ఫిన్ అలెన్​ ​(100 నాటౌట్​; 33 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్​లు) సెంచరీతో వీరవిహారం చేశాడు. టీ20 ప్రపంచకప్​ టోర్నీలోనే అత్యంత వేగవంతమైన శతకంతో రికార్డు సృష్టించాడు. మరో ఓపెనర్​ టిమ్​ సీఫర్ట్​(58; 33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్​లు) హాఫ్​ సెంచరీతో మెరిశాడు. ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆట ఆడుకుంటూ వీళ్లిద్దరూ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించారు. మొదటి వికెట్​కు 9.1ఓవర్లలో ఏకంగా 117 పరుగులు జోడించారు. అనంతరం స్టీఫర్ట్​ను రబడ ఔట్​ చేయడంతో వీరి భాగస్వామ్యానికి బ్రేక్​ పడింది. అయితే, అప్పటికే కివీస్ విజయం ఖాయమైంది. రచిన్​ రవీంద్ర (13 నాటౌట్​; 11 బంతుల్లో 2 ఫోర్లు) మిగిలిన లాంఛనాన్ని అలెన్​ పూర్తి చేశాడు. న్యూజిలాండ్​ జట్టు 12.5 ఓవర్లలోనే టార్గెట్​ను ఛేదించడం విశేషం. సెంచరీతో వీరుడు అలెన్​ ఫిన్​కు ‘ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​’ దక్కింది. రేపు భారత్​, ఇంగ్లాండ్​ జట్ల మధ్య జరిగే మ్యాచ్​లో విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో కివీస్​ ఆడుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!