కలం, తెలంగాణ బ్యూరో : ‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు… వచ్చే ఆదాయంలో పెద్ద మొత్తం గత సర్కార్ చేసిన అప్పులకు, వడ్డీలకే చెల్లించాల్సి వస్తున్నది… మేం అనవసరం హంగులు, ఆర్భాటాలు, దుబారా ఖర్చులు తగ్గించుకొని చక్కదిద్దుతున్నాం”
– సీఎం రేవంత్ రెడ్డి
‘‘మేం కడుపు కట్టుకొని రాష్ట్రాన్ని చక్కదిద్దుతున్నాం.. అవసరంలేని ఖర్చులు తగ్గించుకొని ప్రజల సంక్షేమానికి ఖర్చుచేస్తున్నాం”
– కేసీఆర్ (పవర్‌లో ఉన్నప్పుడు)
ఎవరి మాటలు ఎలా ఉన్నా ప్రజాధనం దుర్వినియోగంలో ఇద్దరికిద్దరూ సేమ్ టు సేమ్. గొప్పలు చెప్పుకోవడంలో, వాటిని దేశమంతా ప్రచారం చేసుకోవడంలో దొందూ దొందే! ‘దేశ్ కీ నేత’ అంటూ దేశమంతా ప్రచారం కోసం నాడు కేసీఆర్ కోట్లకు కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. తెలంగాణలో అమలవుతున్న స్కీమ్ లు చూడండి.. అంటూ అన్ని ప్రాంతీయ భాషా పత్రికల్లోనూ ఎడాపెడా యాడ్స్ ఇచ్చిపారేశారు. రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకల పేరుతో 2023లో వందల కోట్లు వీటి కోసమే ఖర్చు చేశారు. సౌత్ స్టేట్స్ తోపాటు యూపీ, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ సహా అన్ని రాష్ట్రాల్లో యాడ్స్ కుమ్మరించారు. పంజాబ్, హర్యానా రైతులకు ఆర్థిక సాయం చేస్తున్నామంటూ దానిపైనా ప్రకటనలకు ఖర్చు చేశారు. అప్పట్లో తీవ్ర స్థాయిలో దుయ్యబట్టిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నది. కేరళ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మలయాళ మనోరమ, మాతృభూమి లాంటి పత్రికలకు యాడ్స్ ఇచ్చి తెలంగాణ పథకాలను ఊదరగొడుతున్నది.
రెండు పార్టీల అధికార దుర్వినియోగం, ప్రజాధనం దుబారాపై ‘కలం’ 360 డిగ్రీస్ (Kalam 360 Degrees) స్పెషల్ చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: కేంద్ర కేబినెట్లోకి నితీశ్.. బిహార్ సీఎం పీఠంపై కమలం?
Follow Us On : WhatsApp

