కలం, వెబ్ డెస్క్: వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) స్పందించారు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. తన కామెంట్లను వక్రీకరించారని అభిప్రాయపడ్డారు. ‘ఇండియా ఈజ్ మై ఇన్స్పిరేషన్’ అంటూ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ‘కొన్నిసార్లు అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తి ఉద్దేశాన్ని ప్రతిబింబించవు. అలాంటి సందర్భాల్లో అపార్థాలు ఏర్పడటం సహజం. తన మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగితే అది దురదృష్టకరం.
భారతీయుడిగా తానెంతో గర్వపడుతున్నానని రెహమాన్ పేర్కొన్నారు. భారతదేశం తనకు కేవలం ఒక దేశమే కాకుండా, తన సృజనాత్మక ప్రయాణానికి ప్రేరణగా నిలిచిన మాతృభూమి అని అన్నారు. వివిధ సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలు తన సంగీతానికి శక్తినిచ్చాయని చెప్పారు.
తన జీవిత లక్ష్యం సంగీతానికి సేవ చేయడమేనని, సంగీతం ద్వారా ప్రజలను కలపడం, శాంతి-సౌహార్దాలను ప్రోత్సహించడమే తన కర్తవ్యమని రెహమాన్ వివరించారు. మతం, భాష, ప్రాంతం అనే భేదాలు లేకుండా సంగీతం అందరినీ ఒక్కటిగా చేయగల శక్తి కలిగి ఉందని వ్యాఖ్యానించారు.
ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో, రాజకీయ-సాంస్కృతిక వేదికలపై చర్చకు దారి తీయగా, తాజా వీడియోతో ఆ వివాదానికి తెరదించేందుకు రెహమాన్ (AR Rahman) ప్రయత్నిస్తున్నారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Read Also: సాఫ్ట్వేర్ ఉద్యోగుల అనుమానాస్పద మృతి
Follow Us On: X(Twitter)


