నల్గొండ జిల్లా చిట్యాలలో రోడ్డు ప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : నల్గొండ జిల్లా చిట్యాల (Chityal) ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అధిక వేగంతో వెళ్లే బీఎండబ్ల్యూ (BMW) రేసింగ్ బైక్ కంట్రోల్ తప్పి స్కిడ్ అవడం వల్ల రైడర్ రితీష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు హైదరాబాద్ నివాసి. రితీష్ 30 మంది రైడర్ల గ్రూప్‌తో బాపట్లకు వెళ్ళాడు. బాపట్ల నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఘటన సమయంలో రీతీష్ రెడ్డి అధిక వేగంతో బైక్ నడుపుతున్నాడు. రోడ్డు పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పటికీ, అధిక వేగం కారణంగా బైక్ నియంత్రణ తప్పినట్లు తెలుస్తోంది. రితీష్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చిట్యాల (Chityal) పోలీస్ స్టేషన్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని.. ప్రమాద కారణాలను, బైక్ వేగం, రోడ్డు పరిస్థితులు తదితర అంశాలను పరిశీలిస్తూ  దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: సిద్ధ రామ‌య్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన డీకే శివ‌కుమార్‌

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>