epaper
Wednesday, February 18, 2026
epaper

మధిర మున్సిపల్ చైర్మన్ ఎంపికపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

కలం, ఖమ్మం బ్యూరో : మధిర మున్సిపల్ చైర్మన్ ఎంపికపై డిప్యూటీ సీఎం (Deputy CM Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మధిరలోని క్యాంపు కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ కౌన్సిలర్ల తో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎంపికపై స్పందిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్​ చార్జ్ మంత్రి కొండా సురేఖ.. మున్సిపల్ చైర్మన్ అభ్యర్ధి పేరును అధికారికంగా ప్రకటిస్తారని వెల్లడించారు.

అభ్యర్ధి ఎంపికలో ఎలాంటి తారతమ్యాలు ఉండవని, అర్హత పార్టీ విధేయత ఆధారంగానే ఎంపిక ఉంటుందని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా పార్టీ నిర్ణయాలను అమలు చేసేందుకు, కౌన్సిలర్లకు మార్గ నిర్దేశం చేసేందుకు కోన దని కుమార్ కు విప్ జారీ చేసే అధికారాన్ని అప్పగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం నూతన కౌన్సిలర్లను అభినందించి, సత్కరించారు.

Deputy CM Bhatti
Deputy CM Bhatti

Read Also: రేవంత్​కి అనుకూలంగా పనిచేస్తున్న ఎస్​ఈసీ : ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>