చార్ ధామ్ యాత్రలో విషాదం.. 32 మంది మృత్యువాత..!

కలం, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్‌లో ఎంతో పవిత్రంగా భావించే చార్ ధామ్ యాత్రలో విషాద ఛాయలు అలముకున్నాయి. యాత్ర ప్రారంభమైన కేవలం 19 రోజుల్లోనే వివిధ కారణాలతో 32 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరణించిన వారిలో అత్యధికులు కేదార్‌నాథ్ మార్గంలోనే ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. హిమాలయాల్లోని ప్రతికూల వాతావరణం, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, గుండెపోటు వంటి ఆరోగ్య సమస్యలే ఈ మరణాలకు ప్రధాన కారణాలని తెలుస్తోంది. ముఖ్యంగా కేదార్‌నాథ్ ధామం వద్ద భక్తుల రద్దీ విపరీతంగా పెరగడం, అక్కడి భౌగోళిక పరిస్థితులను తట్టుకోలేక వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. యాత్రలో గతేడాది కంటే ఈసారి భక్తుల తాకిడి రెట్టింపు కావడంతో సౌకర్యాలపై కూడా తీవ్ర ఒత్తిడి పడుతోంది.

ఆరోగ్యంగా ఉన్న వాళ్లే యాత్రకు వెళ్లాలి: ప్రభుత్వం

ఈ ఘటనలపై స్పందించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. యాత్రికులు తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించింది. ముఖ్యంగా అధిక రక్తపోటు, శ్వాసకోస వ్యాధులు ఉన్నవారు వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాతే యాత్రకు రావాలని కోరింది. యాత్రా మార్గాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని, అత్యవసర సమయాల్లో భక్తులకు తక్షణ సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. భక్తుల మరణాలు ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>