రాజకీయ కక్ష సాధింపు.. పీఏ హత్యపై సువేందు ఫైర్

కలం, నేషనల్ డెస్క్: పశ్చిమ బెంగాల్ బీజేపీ కీలక నేత సువేందు అధికారి (Suvendu Adhikari)  తన వ్యక్తిగత సహాయకుడు చందర్‌నాథ్ రథ్ హత్యపై తీవ్రంగా స్పందించారు. ఈ హత్య వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉందని ఆరోపించారు. భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీని ఓడించినందుకే.. దానికి ప్రతీకారంగా తన సన్నిహితుడిని పొట్టనబెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. చందర్‌నాథ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయిన తర్వాత సువేందు అధికారి మీడియాతో మాట్లాడారు.. ‘‘చందర్‌నాథ్ నా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కావడమే ఆయన చేసిన తప్పా? భవానీపూర్‌లో మమతా బెనర్జీ (Mamata Banerjee)పై నేను సాధించిన విజయాన్ని జీర్ణించుకోలేకనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.

ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్య’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చందర్‌నాథ్ శరీరంలోకి 4 బుల్లెట్లు దూసుకెళ్లాయని, నిందితులు పక్కాగా రెక్కీ నిర్వహించి ఈ దాడికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. నిందితులను తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని, బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని సువేందు డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>