కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ (Hit and Run) కేసులు పెరుగుతున్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు అమలు చేసినా, విస్తృతంగా అవగాహన కల్పించినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. తాజాగా హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. నగరంలో మాదాపూర్‌లో ఓ హోంగార్డు విధుల్లో ఉండగా, వేగంగా వచ్చిన కారు అతనిపై దూసుకెళ్లింది. 45 ఏళ్ల నయీమ్ అనే హోంగార్డు సిగ్నల్ వద్ద ట్రాఫిక్‌ను నియంత్రిస్తుండగా ఈ ఘటన జరిగింది.
అతివేగంగా వస్తున్న కారు అతన్ని ఢీకొట్టిందని, ఆ తర్వాత డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికులు వెంటనే గాయపడిన హోంగార్డును చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మాదాపూర్ పోలీసులు హిట్ అండ్ రన్ కేసు (Hit and Run) నమోదు చేసి, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం దర్యాప్తు ప్రారంభించారు. వాహనాన్ని గుర్తించడానికి, నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు సమీప ప్రాంతాల నుండి సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.
Read Also: జీవితంపై విరక్తితో వృద్ధ దంపతుల ఆత్మహత్య
Follow Us On: X(Twitter)


