వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

కలం, వెబ్ డెస్క్: రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా మక్కా మసీదులో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల దృష్ట్యా హైదరాబాద్ (Hyderabad) పాతబస్తీలోని చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Diversions) విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. చార్మినార్ నుంచి మదీనా, ముర్గిచౌక్, శాలిబండ వైపు వెళ్లే ప్రధాన రహదారులు మూసివేయబడతాయి. ఈ క్రమంలో మదీనా జంక్షన్ వద్దకు వచ్చే వాహనాలను సిటీ కాలేజ్ వైపు, హిమ్మత్‌పుర వద్ద వచ్చే ట్రాఫిక్‌ను హరిబౌలి, ఖిల్వత్ వైపు మళ్లిస్తారు. అలాగే మోతీగల్లి, ఎతేబార్ చౌక్, కమాన్ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. ఆర్టీసీ బస్సులు అఫ్జల్‌గంజ్ వరకు మాత్రమే అనుమతించబడతాయి. జిల్లాలకు వెళ్లే బస్సులు చాదర్‌ఘాట్, సైదాబాద్, ఐఎస్ సదన్, మిధాని మీదుగా మళ్లించబడతాయి.

మదీనా, పత్తర్‌గట్టి నుండి వచ్చే వాహనదారులు గుల్జార్ ఫంక్షన్ హాల్‌లో, యాకుత్‌పుర, దబీర్‌పురా నుంచి వచ్చే వారు ముఫీద్-ఉల్-అనామ్ గ్రౌండ్స్‌లో వాహనాలను పార్క్ చేయాలి. అలాగే చార్మినార్ బస్ టెర్మినల్, ఏయూ హాస్పిటల్, ఖిల్వత్ గ్రౌండ్, ఉర్దూ మస్కన్ (చౌమహల్లా ప్యాలెస్ ఎదురుగా) వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ జోన్‌లో సుభాష్ రోడ్డు ఉదయం నుంచి సాయంత్రం వరకు మూసేసి ఉంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>