‘ది ట్రైటర్స్’ తెలుగు వెర్షన్‌కు హోస్ట్‌గా తేజ సజ్జా

కలం, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) మరో కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన రియాలిటీ షో ‘ది ట్రైటర్స్’ (The Traitors) ను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ముందుకొచ్చింది. ఈ షోకు తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన ఈ షో ఇప్పుడు తెలుగు వెర్షన్‌లో రాబోతుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ షో ద్వారా తేజ సజ్జా తన ప్రత్యేక శైలిలో ప్రేక్షకులను అలరించనున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా తేజ సజ్జా నటించనున్న ‘జాంబీ రెడ్డి 2’(Zombie Reddy 2) సినిమా కొంత ఆలస్యంగా తెరకెక్కే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, ఈ రియాలిటీ షో తేజ సజ్జాను ప్రేక్షకులకు మరింత చేరువ చేయనుంది. ఇప్పటికే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా, ఈ షో ద్వారా హోస్ట్‌గా ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>