epaper
Wednesday, February 18, 2026
epaper

ఫోన్ ట్యాపింగ్ విచారణ అందుకే స్లో అయ్యింది: రేవంత్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో 2029లో జమిలి ఎన్నికలే జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)  వ్యాఖ్యానించారు. తాను రంజిత్ రెడ్డి‌కి మంత్రి పదవి ఇస్తానని అనలేదని క్లారిటీ ఇచ్చారు. స్థానిక మున్సిపాలిటీ‌ల అభివృద్ధి భాధ్యత రంజిత్ రెడ్డికి ఇస్తానన్నానని చెప్పారు. కవిత ఇష్యూపై కూడా రేవంత్ స్పందించారు. కవిత ఇష్యూ వాళ్ల కుటుంబానికి సంబంధించినదని వ్యాఖ్యానించారు. వాళ్ళ కుటుంబం పరిష్కరించుకుంటే సమస్య బయటకి వచ్చేది కాదన్నారు. అధికారం ఉన్నంత సేపు వాళ్ళు కలసి ఉన్నారని .. అధికారం పోయాక తన్నుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

వాళ్ళు అందరూ కలసి ఉన్నప్పుడే ఓడించానని ఇప్పుడు ఓడించడం పెద్ద కష్టం కాదన్నారు. భాష మీద వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. కేసీఆర్, కిషన్ రెడ్డిని ఉద్దేశించి బూతు ప్రయోగం చేశారని.. అప్పుడు ఆయనకు భాష గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం (Kaleshwaram) విచారణపై సీబీఐ ఓ నిర్ణయం తీసుకుంటే తాము ముందుకెళ్తామని పేర్కొన్నారు. సీబీఐ రిజెక్ట్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం టేకోవర్ చేస్తుందని తెలిపారు. తెలంగాణ మా తాతల జాగీర్ మా జన్మ హక్కు అంటే కుదరదని పేర్కొన్నారు. మంది సంసారాలను కులదోస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు అందుకే ఆలస్యం

ప్రభాకర్ రావును అమెరికాలో దాచి పెట్టడం వల్లే ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) ఆలస్యమైందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పారు. బీజేపీ ప్రభాకర్ రావును రాష్ట్రానికి రానివ్వకుండా కాపాడిందన్నారు. సుప్రీంకోర్టు ఇన్వాల్ అయ్యాక తీసుకరావడానికి 20 నెలలు పట్టిందని చెప్పారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం 2027 వరకు జిల్లాల రీఆర్గనైజేషన్ కుదరదని వ్యాఖ్యానించారు. 2026 జనగణన తర్వాత నియోజకవర్గ పునర్విభజన జరుగుతుందన్నారు.

2029లోనే జనరల్ ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ కూడా వచ్చే ఎన్నికల నాటికి అమల్లోకి వస్తుందని చెప్పారు. మోడీ ఏ ప్రాతిపదికన తీసుకుంటుండో అర్థం కావట్లేదన్నారు. దక్షిణాది రాష్ట్రాలను మోడీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. అన్ని దేవాలయాలకు విజయడైరీ నుండి నెయ్యి కొనుగోలు చేస్తున్నామన్నారు. క్యాబినెట్ తీర్మానం చేశాకే అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశామని చెప్పారు. ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉందని చెప్పారు. బడ్జెట్ సమావేశాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

Read Also: చిట్యాల ప్రజలకు ఎమ్మెల్యే వేముల వీరేశం గుడ్ న్యూస్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>