కలం, మెదక్ బ్యూరో : సదాశివపేట (Sadashivpet) పట్టణ ప్రజల దీర్ఘకాలిక తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా కొత్త వాటర్ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) తెలిపారు. సింగూరు డ్యామ్ నుంచి నేరుగా సదాశివపేట మున్సిపాలిటీకి తాగునీరు సరఫరా చేసేలా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకోసం ఇంటెక్ వెల్, ఫిల్టర్ బెడ్లు, ట్యాంకులు, కొత్త పైపులైన్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. రూ.135 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నప్పటికీ, ప్రజల అవసరాల ఆధారంగా వ్యయం పెరిగినా అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. పట్టణంలోని ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించడమే లక్ష్యమని అన్నారు.
ఈ నెల 17న మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించి ప్రాజెక్టుపై చర్చించాలని సూచించారు. వాటర్ స్కీమ్‌కు ఆమోదం లభించిన వెంటనే టెండర్లు పిలిచి రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని (Jagga Reddy) తెలిపారు. ఈ అంశంపై టీజీఐఐసీ చైర్మన్ నిర్మల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కమిషనర్, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Read Also: ప్రధాని మోదీకి ప్రియాంకా గాంధీ కౌంటర్
Follow Us On: Sharechat

