Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రధాని మోదీకి ప్రియాంకా గాంధీ కౌంటర్

కలం, వెబ్ డెస్క్: మహిళా బిల్లు (Women Reservation Bill) విషయంలో ప్రధాని మోదీ సభను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) విమర్శించారు. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు రెండు వేర్వేరు అని గుర్తు చేశారు. తాము మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని.. కానీ డీలిమిటేషన్‌ను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మహిళా బిల్లు విషయంలో మోతీలాల్ నెహ్రూ చొరవ తీసుకున్నారని ప్రియాంకా గాంధీ గుర్తు చేశారు. బీజేపీ కూడా గతంలో మహిళా బిల్లును వ్యతిరేకించిందని పేర్కొన్నారు. ఈ బిల్లు విషయంలో ప్రధాని మోదీ (PM Modi).. కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ ఏమీ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో తామే చాంపియన్ అన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తోందని ప్రియాంక వ్యాఖ్యానించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం లేదని.. రాహుల్ గాంధీ నేరుగా ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. దేశంలో కులగణన ఎందుకు నిర్వహించడం లేదని ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. అట్టడుగు వర్గాలకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని ఓబీసీలకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉందని ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) పేర్కొన్నారు.

Read Also: భగ్గుమంటున్న భానుడు.. 44 డిగ్రీలు దాటనున్న టెంపరేచర్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>