గాంధీ భవన్‌లో మేధావుల విభాగం విస్తరణపై సమావేశం

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ మేధావుల విభాగం (TPCC Intellectual Cell) రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశానికి మేధావుల విభాగం రాష్ట్ర చైర్మన్ ఆనంతుల శ్యామ్ మోహన్ అధ్యక్షత వహించారు. ఈ మీటింగ్ లో పార్టీ సంస్థాగత బలోపేతం, మేధావుల విభాగం విస్తరణ, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ వైఖరిపై చర్చించారు. అలాగే ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లే అంశాలపై విస్తృత చర్చ జరిగింది.

ఈ సందర్భంగా నాయకులు రాష్ట్రవ్యాప్తంగా మేధావుల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు కార్యాచరణను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ మీటింగ్ కు ఆల్ ఇండియా కాంగ్రెస్ ఇంటెలెక్చువల్ సెల్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ దావల్, వైస్ చైర్మన్ పుష్ప లక్ష్మణ్, పలువురు రాష్ట్ర నాయకులు, మేధావుల విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>